సీఎం జగన్ సంచలన నిర్ణయం.. నేటి నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్
Plastic Flexies bans in Andhra Pradesh from Today says CM Jagan.నేటి నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేదిస్తున్నట్లు ప్రకటించారు.
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2022 1:24 PM ISTముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నేటి(శుక్రవారం ఆగస్టు 26) నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని 2027 కల్లా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామని తెలిపారు. అందులో భాగంగానే ప్లాస్టిక్ ఫెక్సీల బ్యాన్ తొలి అడుగని అన్నారు. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో 'పార్లే ఫర్ ది ఓషన్స్' సంస్థతో ఎంఓయూ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
ఈ వేదికపై నుంచే ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ప్రకటన చేశారు. ఈ రోజు విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందని, దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించినట్లు చెప్పారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోందని, అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులు అందరిది అని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు.
పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుందని, రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుందని తెలిపారు. పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్లాస్టిక్ నుంచి రీసైక్లింగ్ నుంచి తయారు చేసిన షూస్, కళ్ల జోడులను స్వయంగా ఆయన చూపించారు.
రాష్ట్రంలో ఈ రోజు నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తున్నాం#YSRCP #CMYSJagan pic.twitter.com/7QCdPoYoL8
— YSR Congress Party (@YSRCParty) August 26, 2022
ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ప్రకటించారు. రాష్ట్రంలో గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని సీఎం అభిప్రాయపడ్డారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలని సూచించారు.
విశాఖపట్నం వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే ఉన్నాయని, అవన్నీ తనవే ఉన్నాయన్నారు. అయితే అవి క్లాత్ బ్యానర్లు అని చెప్పారని వెల్లడించారు. ఇకపై తన బ్యానర్లు సైతం ప్లాస్టిక్ వి ఎక్కడ కనిపించినా వెంటనే చింపివేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే తిరుపతిలో పూర్తిగా ప్లాస్టిక్ లేకుండా చేశామని అది మంచి ఫలితాలను ఇస్తోందన్నారు.