ఎమ్మెల్యే గారి తాలూకా.. పిఠాపురంలో స్టిక్కర్ల ర‌చ్చ‌

పిఠాపురం.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. కార‌ణం అక్క‌డ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌డం.

By Medi Samrat  Published on  28 May 2024 7:01 AM IST
ఎమ్మెల్యే గారి తాలూకా.. పిఠాపురంలో స్టిక్కర్ల ర‌చ్చ‌

పిఠాపురం.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది. కార‌ణం అక్క‌డ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌డం. ఆయ‌న‌కు టాలీవుడ్ న‌టులు చాలా మంది మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌డం. ప‌వ‌న్ మీద పోటీ చేసింది మ‌హిళ కావ‌డం. గెలిపించండి.. డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తాన‌ని సీఎం జ‌గ‌న్‌ మాట ఇవ్వడం.. ఇలా చెప్పుకోవ‌డానికి ఇంకా చాలానే ఉన్నాయి.

పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది గెలుపుపై నేత‌ల‌లో ఎవ‌రి అంచ‌నాలు వారికున్నాయి. ఇక ఓట‌ర్ల విష‌యానికొస్తే.. స్థానికంగా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్' అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసీపీ అభిమానులు మాత్రం ‘డిప్యూటీ సీఎం వంగా గీత' అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల ఓట‌ర్ల అభిమానం తారాస్థాయికి చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలుస్తుంది. గెలుపుపై ధీమాతో స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు. ఈ హ‌డావుడికి జూన్ 4వ తేదీన తెర‌ప‌డ‌నుంది.

Next Story