న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్

న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By -  Knakam Karthik
Published on : 30 Dec 2025 6:31 AM IST

Andrapradesh, liquor sales, Permission Extend, New Years Eve, Excise Department, AP State Beverages Corporation Limited

న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్

అమరావతి: న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ , ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రత్యేక అనుమతులను అనుసరించి ఏ4 మద్యం దుకాణాలు డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 రాత్రుల్లో అర్ధరాత్రి 12.00 గంటల వరకు మద్యం విక్రయించవచ్చు. అలాగే 2B (బార్లు), సి 1 (ఇన్-హౌస్), ఈపిఐ(ఈవెంట్ పర్మిట్), టీడీ1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించడానికి, రెస్టారెంట్ సర్వీస్ లకు అనుమతి పొందాయి.

గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా అమలులో ఉన్న విధానానికి అనుగుణంగా ఈ సడలింపు ఇవ్వబడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం లేదా అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

Next Story