రోడ్ల దుస్థితిపై పవన్‌ సెటైరికల్‌ ఫొటో ట్వీట్‌

Pawan Kalyan's tweet to inform about the condition of roads. ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్‌ చేపట్టింది. ఈ క్యాంపెయిన్‌లో పార్టీ చీఫ్ పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు.

By అంజి
Published on : 15 July 2022 11:27 AM IST

రోడ్ల దుస్థితిపై పవన్‌ సెటైరికల్‌ ఫొటో ట్వీట్‌

ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్‌ చేపట్టింది. ఈ క్యాంపెయిన్‌లో పార్టీ చీఫ్ పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. 'గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌తో గుంతలు ఉన్న రోడ్ల ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్.. రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకంగా మారిందో తెలియజేసే వ్యంగ్య చిత్రాన్ని తన ట్విటర్‌లో పోస్టు చేశారు. అలాగే రావుల పాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్డులో కొత్తపేట దగ్గర అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు వీడియోను పోస్టు చేశారు.



Next Story