పవన్ సనాతన ధర్మ పరిరక్షణ టూర్..కేరళలోని అగస్త్య మహర్షి ఆలయ సందర్శన

పవన్ కల్యాణ్ కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

By Knakam Karthik
Published on : 12 Feb 2025 1:26 PM IST

Andrapradesh, Deputy CM Pavan Kalyan, Sanathan Dharma Campaign,

పవన్ సనాతన ధర్మ పరిరక్షణ టూర్..కేరళలోని అగస్త్య మహర్షి ఆలయ సందర్శన

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళ పర్యటనకు వెళ్లారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం పవన్ కల్యాణ్ కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఉన్నారు. కాగా బుధవారం తిరువనంతపురంలోని పరశురామస్వామి పవన్ కల్యాణ్‌ సాయంత్రం సందర్శిస్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర, స్వామి మలై, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వెళ్తారు.

Next Story