ఇటీవల ఓ చిత్ర ఫ్రీ రిలిజ్ వేడుకలో జనసేన అధినేత, నటుడు పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు పలువురు ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. బదులుగా పవన్ ఓ ట్వీట్ చేయగా.. దానికి కౌంటర్‌గా మంత్రి పేర్ని నాని మరో ట్వీట్ చేశారు. తాజాగా పవన్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు ట్వీట్ చేశారు. వైసీపీ ది పాలసీ ఉగ్రవాదం. దీంతో అన్ని రంగాలు, వర్గాలు నాశనం అవుతాయి. పాలసీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొవాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..