టీమిండియా క్రికెటర్‌ కన్నా.. వైసీపీ నాయకుడే ఎక్కువా?: పవన్ కళ్యాణ్

టీమిండియా క్రికెటర్‌, ఏజీ రంజీ జట్టు ఎక్స్‌ కెప్టెన్‌ హనుమ విహారీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సంఘీభావం తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  27 Feb 2024 8:26 AM GMT
pawan kalyan,  hanuma vihari, cricket, ycp,

 టీమిండియా క్రికెటర్‌ కన్నా.. వైసీపీ నాయకుడే ఎక్కువా?: పవన్ కళ్యాణ్

టీమిండియా క్రికెటర్‌, ఆంధ్ర రంజీ జట్టు ఎక్స్‌ కెప్టెన్‌ హనుమ విహారీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత క్రికెటర్‌ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని నిలదీశారు పవన్ కళ్యాణ్‌. భారత్‌ క్రికెట్‌ జట్టుకి 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన హనుమ విహారి ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడని తెలిపారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో అద్భుత ప్రదర్శనతో క్రీడా ప్రటిమను చూపించాడని చెప్పారు. మరోవైపే గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టు ఐదు సార్లు రంజీలో నాకౌట్‌కు అర్హత సాధించడంలో కూడా అతని ప్రతిభే సహాయపడిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. విరిగిన చేతి, మోకాలుకి గాయమైనా హనుమ విహారి ఆటను కొనసాగించాడని చెప్పారు. భారత జట్టుకోసం, ఆంధ్ర జట్టు జట్టుకోసం ఎంతో కష్టపడ్డాడని పవన్ అన్నారు.

ఒక వైసీపీ కార్పొరేటర్‌ కారణంగా హనుమ విహారి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారని పవన్ అన్నారు. రాజీనామా సమర్పించారని చెప్పారు. భారత క్రికెటర్‌, ఆంధ్ర రంజీ టీమ్‌ కెప్టెన్‌ కంటే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎలాంటి క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని స్థానిక వైసీపీ రాజకీయ నాయకుడు విలువైన వ్యక్తిగా మారడం అవమానకరమని పవన్ కళ్యాన్ చెప్పారు.

ఇలాంటి పరిస్థితులతో ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాలను ఎందుకు నిర్వహిస్తున్నారని పవన్ కళ్యాణ్‌ ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా లాభం లేదన్నారు. ఇక హనుమ విహారి అందించిన విశిష్ట సేవలు రాష్ట్రంలోని పిల్లల్లో స్ఫూర్తి నింపిందని కొనియాడారు. ఆటలో అతని పోరాట పటిమ క్రీడాకారులను ఉత్తేజపరించిందని చెప్పారు. హనుమ విహారికి జరిగిన అన్యాయానికి మన ఏపీ క్రికెట్‌ అసోసియేషన్ చూపిన వివక్షత పట్ల చింతిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో మంచి జరగాలని కోరకుంటున్నట్లు పవన్ కళ్యాణ్‌ తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రా తరఫున మళ్లీ ఆడాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్‌ చెప్పారు.

Next Story