వైసీపీ నేతల మాటలతో నా భార్య కూడా ఏడుస్తోంది: పవన్ కళ్యాణ్

వైసీపీ నాయకుల మాటలతో తన భార్య కూడా ఏడుస్తోందని అన్నారు పవన్.

By Srikanth Gundamalla  Published on  11 July 2023 12:36 PM GMT
Pawan Kalyan, Janasena, Volunteers, YCP,

 వైసీపీ నేతల మాటలతో నా భార్య కూడా ఏడుస్తోంది: పవన్ కళ్యాణ్

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వుమెన్ ట్రాఫికింగ్‌ వ్యాఖ్యలు చేశాక వైసీపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. తీవ్రంగా దూషణలు చేస్తున్నారు. ఎలా పెంచారంటూ పవన్‌ కళ్యాణ్‌పై మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై పవన్‌ కళ్యాణ్ స్పందించారు. వారు దారుణంగా మాట్లాడుతున్నారని.. వైసీపీ నాయకుల మాటలతో తన భార్య కూడా ఏడుస్తోందని అన్నారు పవన్.

ఏలూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్‌ కళ్యాణ్ మాట్లాడారు. ఎవరో పెట్టిన పార్టీని వైసీపీ వాళ్లు తీసుకున్నారు. రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని.. అందుకే నిలబడినట్లు పవన్ అన్నారు. యువజనులు, శ్రామికులు, రైతులకు వైసీపీ ఏమీ చేయలేదు. కానీ నన్ను బెదిస్తున్నారు. డబ్బుతో మభ్య పెట్టాలని చూశారు. జగన్‌ అంటే కోపం లేదు.. ప్రభుత్వ విధానాలపైనే తనకు ద్వేషం అని అన్నారు. నాయకులు చేసే తప్పులు ప్రజలపై చూపుతాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ అన్నారు.

ఉపాధి హామీ కూలీల కంటే వాలంటీర్ల జీతాలు తక్కువగా ఉన్నాయని అన్నారు పవన్. వాలంటీర్‌ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని.. ఆ సమాచారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని పవన్ ప్రశ్నించారు. అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదన్నారు. వీటన్నింటికీ సమాధానాలు చెప్పకుండా.. సమస్యలను పక్క దోవ పట్టించడానికే నాపై విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. సేవ చేయాల్సిన వాలంటీర్లు ప్రజలపై ఎందుకు దాడులు చేస్తున్నారు అని పవన్‌ మరోసారి ప్రశ్నించారు. వైసీపీ నాయకుల దూషణలు ఘోరంగా ఉన్నాయని.. వారి మాటలు విని తన భార్య కూడా ఏడుస్తోందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Next Story