జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం ఎన్నుకున్నారు.

By అంజి  Published on  11 Jun 2024 6:02 AM GMT
Pawan Kalyan, Janasena floor leader, Andhra Pradesh Assembly

జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం ఎన్నుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది. జనసేన తెనాలి శాసనసభ్యుడు నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు ఎన్డీయే శాసనసభ్యుల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎన్డీయే కూటమి శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును పవన్‌ కల్యాణ్ ప్రతిపాదించారు. 175 మంది సభ్యులున్న సభలో జనసేనకు 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 164 అసెంబ్లీ స్థానాల (టీడీపీ-135, జనసేన-21, బీజేపీ-8) మెజారిటీతో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది.

Next Story