ఏపీ భవిష్యత్‌ కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ: పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసం టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయిని పవన్ కళ్యాణ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By Srikanth Gundamalla
Published on : 14 Sept 2023 1:50 PM IST

Pawan Kalyan,  TDP, Janasena, Alliance,

ఏపీ భవిష్యత్‌ కోసం టీడీపీ-జనసేన కలిసి పోటీ: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం స్కామ్ కేసులో అరెస్ట్‌ అయ్యిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన పవన్‌ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ పాలనపై విసిగిపోయామని.. ఇవాళ నిర్ణయం తీసుకున్నానని పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసం టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయిని చెప్పారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు పవన్. అయితే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలనేది తన కోరిక అని వపన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీకి అనుకూలంగా ఉంటోన్న క్రిమినల్స్‌ను వదలబోమని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు.

సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. గత నాలుగేళ్లలో ఏపీలో అరాచక పాలన సాగిందని మండిపడ్డారు. అరాచక పాలనలో భాగంగానే మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబుని అరెస్ట్ చేశారని అన్నారు. చట్ట వ్యతిరేకంగా రిమాండ్‌ పంపించారని అన్నారు. చంద్రబాబుకి సంఘీభావంగా రాజమండ్రి జైలుకు వచ్చానని.. ఆయన్ని కలిసి మాట్లాడాకే పొత్తుపై ప్రకటన చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబుపై గతంలో కూడా పాలసీ పరంగానే విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయని.. తాము విడిగా కూడా పోటీ చేశామన్నారు. అయితే.. రాష్ట్రం బాగుండాలని ఈ సారి ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్‌ స్పష్టం చేశారు.

చంద్రబాబుని జైలులో కూర్చోబెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాల్లో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్ అని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అడ్డగోలుగా జగన్ దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై కేసు పెట్టడం.. ఆ తర్వాత జైల్లో పెట్టడం రాజకీయ ప్రతీకారమన్నారు పవన్ కళ్యాణ్. జగన్‌కు ఇక ఆరు నెలలే ఉందని.. యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తామని పవన్ అన్నారు. జగన్ అరాచక పాలనకు మద్దతు పలుకున్న ఏ ఒక్కరినీ కచ్చితంగా వదలమని పవన్ కళ్యాణ్ అన్నారు.

Next Story