రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు
Pattabhi Shifted to Rajahmundry Central jail.ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి
By తోట వంశీ కుమార్ Published on 22 Oct 2021 6:10 AM GMT
ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో గురువారం విజయవాడ కోర్టు పట్టాబికి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. నిన్న ఆయన్ను మచిలీపట్నం జైలుకు తీసుకువెళ్లారు. నిన్నరాత్రంతా ఆయన్ను మచిలీపట్నం సబ్‌జైల్లో ఉంచారు. ఈ రోజు ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను పోలీస్ బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. మరోవైపు ఆయనకు బెయిల్ ఇవ్వాలనిక కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఐదు రోజులు పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
సీఎంపై టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ నేడు కూడా వైసీపీ శ్రేణులు జనాగ్రహ దీక్షలు కొనసాగిస్తున్నాయి. టీడీపీ నేత చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దగ్థం చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ఈ రోజు రాత్రి 8 గంటలకు ముగియనుంది.