మాది డీఎన్‌ఏ ప్రభుత్వం కాదు.. ఎన్డీఏ ప్రభుత్వం: హోంమంత్రి అనిత

తనను రాజీనామా చేయాలన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హోంమంత్రి అనిత కౌంటరర్‌ ఇచ్చారు.

By అంజి
Published on : 28 July 2024 2:08 PM IST

NDA government, Home Minister Anitha,  MP Vijayasai Reddy, APnews

మాది డీఎన్‌ఏ ప్రభుత్వం కాదు.. ఎన్డీఏ ప్రభుత్వం: హోంమంత్రి అనిత

తనను రాజీనామా చేయాలన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హోంమంత్రి అనిత కౌంటరర్‌ ఇచ్చారు. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో, నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందన్నారు. అయినా ఇది డీఎన్‌ఏ ప్రభుత్వం కాదని, ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు. ప్రజలు బానే ఉన్నారన్న హోంమంత్రి అనిత.. దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్‌మీట్లు పెడుతున్నారని, ఎక్స్‌లో రెట్టలు వేస్తున్నారని మండిపడ్డారు.

అంతకుముందు రాష్ట్ర హోంమంత్రి అనిత మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్నారు. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి ఉందన్నారు. దీనికి బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలన్నారు. హత్యలు జరగకుంగా చూడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్‌ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

Next Story