Anganwadi Recruitment : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. అంగన్వాడీలో 243 పోస్టులు భ‌ర్తీకి ఉత్త‌ర్వులు

అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2023 8:11 AM IST
Anganwadi Recruitment, AP

అంగన్వాడీలో 243 పోస్టుల భ‌ర్తీకి ఉత్త‌ర్వులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. రాష్ట్రంలో మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అంగీక‌రించింది. ఈ పోస్టుల‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమ‌వారం ప్ర‌భుత్వం జారీ చేసింది.

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..

61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా-శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేం ద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Next Story