వైసీపీకి బిగ్‌ షాక్.. ఎంపీ మాగుంట రాజీనామా

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.

By అంజి  Published on  28 Feb 2024 4:29 AM GMT
Ongole, MP Magunta Srinivasulu Reddy, YCP, APnews

వైసీపీకి బిగ్‌ షాక్.. ఎంపీ మాగుంట రాజీనామా

వైసీపీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించామని చెప్పారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. తమకు అహం లేదని.. ఆత్మగౌరవమే ఉందని మాగుంట వ్యాఖ్యానించారు.

ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్‌ అని, 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. వైసీపీని వీడటం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. మాగుంట రాజీనామాతో కొద్దిరోజుల్లోనే ఆరుగురు ఎంపీలు వైసీపీని వీడినట్లయింది. వీరిలో ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, సంజీవ్‌కుమార్‌ (కర్నూలు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), రఘురామకృష్ణరాజు (నర్సాపురం)తో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీని వీడారు.

Next Story