కోటి రూపాయల విలువ గల పట్టు చీరలతో కూడిన లారీని బాచుపల్లి పోలీసులు, ఎలక్షన్ అధికారులు సీజ్ చేశారు. వరంగల్ నుండి రెండు లారీలు పట్టు చీరల లోడ్లతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ పంచవతి అపార్ట్మెంట్ కు బుధవారం తెల్లవారు జామున చేరాయి. గుట్టు చప్పుడు కాకుండా అపార్ట్మెంట్ లోని ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకుని ఓ చీరల లోడ్ ను డంప్ చేశారు. మరో లారి చీరలు డంప్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలక్షన్ అధికారులతో కలిసి రంగప్రవేశం చేసి లారీలలోని చీరలను సీజ్ చేశారు. తదుపరి విచారణ కోసం చీరల లోడ్ లారీని బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
భాగంగా రెండు లారిలతో పట్టు చీరలు తెచ్చి మహిళా ఓటర్స్ ను మభ్య పెట్టేందుకే ఈ చీరలను ఓ ముఖ్య నేత తీసుకుని వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్లకు పంచేందుకు పెద్ద ఎత్తున చీరలు దాచినట్లు సమాచారం అందడంతో పోలీసులు, నిజాంపేట నగరపాలక సంస్థ అధికారులు దాడులు చేసి లారీ చీరలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సరుకు విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అధికారులు భావిస్తున్నారు.