రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలో గల ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్‌కి విడతల వారిగా భౌతిక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్‌జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. మహమ్మారి కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ నేపథ్యంలో స్టూడెంట్స్‌కి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తరగతుల కోసం ఆప్షన్ ఇచ్చామన్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ (ఈ4) స్టూడెంట్స్‌కి ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని, సోమవారం నుండి ఒంగోలు, ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్‌కి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు.
ఇదిలా ఉంటే ఇడుపులపాయలోని ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌కు సుమారు 1100 మంది స్టూడెంట్స్ చేరుకున్నారు. జనవరి 13 నుండి పీ1 స్టూడెంట్స్‌కి, 19 నుండి ఈ3 స్టూడెంట్స్‌కి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇక మార్చి 2 లోపు ఈ1, ఈ2 స్టూడెంట్స్‌కి ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక ఇటీవల కొంత మంది విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులను బహిష్కరిస్తూ మెయిల్స్ పెట్టారు. దీనిపై స్పందించిన అధికారులు.. స్టూడెంట్స్‌కి ఆఫ్‌లైన్ తరగతుల కోసం షెడ్యూల్ ఇచ్చారు.