అఫీషియల్‌: ముద్రగడ పేరు మారింది.. కొత్తపేరు ఇదే

కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయంలో చేసిన సవాల్‌తో అధికారికంగా తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

By అంజి  Published on  20 Jun 2024 10:03 AM IST
Mudragada Padmanabham, Mudragada Padmanabha Reddy, APnews

అఫీషియల్‌: ముద్రగడ పేరు మారింది.. కొత్తపేరు ఇదే

కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయంలో చేసిన సవాల్‌తో అధికారికంగా తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మారింది. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ విసిరారు. మాట ప్రకారం.. తాజాగా తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజు ముద్రగడ ప్రెస్ మీట్ నిర్వహించి.. తన పేరును మార్చడానికి లాంఛనప్రాయంగా ప్రారంభించడాన్ని ధృవీకరించాడు.

తాజా పరిణామంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ ఆయన కొత్త పేరు పద్మనాభ రెడ్డిని అధికారికంగా గుర్తించింది. ముద్రగడ గతంలో జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైసీపీ) చేరారు. చర్చలు జరిగినా, పవన్ కళ్యాణ్ తన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ పిఠాపురంలో పవన్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారం చేస్తూ, ఆయనపై విమర్శలు చేస్తూ, ఆ ప్రాంతానికి ఆయనకు ఉన్న సంబంధాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముద్రగడపై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. అయితే తన మాట నిలబెట్టుకుని అధికారికంగా పేరు మార్చుకున్నాడు.

Next Story