ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయరంటూ మరోసారి ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని (గతంలో ఆరోగ్య శ్రీ) తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారమని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో ఫేక్ అని తెలిపింది.
''3,257 రకపు వ్యాధులకు చెక్.. ఇక నుండి కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో ఉండే 1949 రకాల వ్యాధులకు ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లై చేసి ఉంటేనే వైద్యం.. మొత్తానికి ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడేశారు'' అంటూ ఓ జీవోతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ అని తెలిపింది.