హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన ఎన్టీఆర్
NTR reacts on the change of name of Health University. ఆంధ్రప్రదేశ్‌లోని హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు చేర్చడంపై పెద్ద దుమారం
By అంజి Published on 22 Sept 2022 3:24 PM ISTఆంధ్రప్రదేశ్‌లోని హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు చేర్చడంపై పెద్ద దుమారం రేగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయమై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ''ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వ విద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు.'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే దీనిపై ఎన్టీఆర్ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (NTRUHS) పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం నందమూరి కుటుంబం వ్యతిరేకిస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్నితీవ్రంగా వ్యతిరేకించారు.
1986లో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలకు ఏకరూప విధానం రావడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయాన్ని అప్పటి రాజకీయ పార్టీలు స్వాగతించాయని రామకృష్ణ గుర్తు చేశారు. 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్‌గా నామకరణం చేశారు. ''మాజీ సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి (వైఎస్‌ఆర్) ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్‌కు ముందు 'డాక్టర్' అని చేర్చి ఎన్టీఆర్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.