ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టుతున్నారు. పాదయాత్ర సందర్బంగా ఆయన ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీలు నెరవేర్చుతూ వస్తున్నారు. దాంతో ప్రజలకు కూడా ఆయన పై నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఈ కారణంతోనే పంచాయితీరాజ్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ జగనే సీఎం అవుతారంటూ వ్యాఖ్యానించారు. కర్నూలు వైద్య కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
జగన్ అప్పులు తెచ్చి రాష్ట్రానికి అన్నీ చేస్తున్నారని ఆయన కొనియాడారు. కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని... వైద్యులు విధులకు రాకపోవటం పెద్ద సమస్య కాదని అన్నారు. అయితే.. ప్రభుత్వ పదవిలో ఉన్న ఆయన.. రాజకీయ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
దేశం కోసం అహర్నిశలూ పోరాడుతున్న సైనికుల గౌరవార్థం.. కేంద్రం ఇచ్చే సాహస పతకాలకు తోడుగా రాష్ట్రం ఇచ్చే ప్రోత్సాహకాలను పదిరెట్లు పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. తిరుపతిలో నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ వేడుకల్లో ఆయన మఖ్య అతిథిగా పాల్గొన్నారు.