NTR district: సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఎన్టీఆర్‌ జిల్లాలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో శుక్రవారం మరో కార్మికుడు కాలిన గాయాలతో మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

By అంజి  Published on  12 July 2024 6:44 AM GMT
NTR district, cement factory blast ,  Death toll, APnews

NTR district: సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో శుక్రవారం మరో కార్మికుడు కాలిన గాయాలతో మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్జున్‌రావు మృతి చెందాడు. జూలై 7న జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని బాయిలర్ యూనిట్‌లో జరిగిన పేలుడులో 17 మంది కార్మికులు గాయపడ్డారు.

గాయపడిన వారిలో ఆవుల వెంకటేష్ చికిత్స పొందుతూ అదే రోజు మరణించాడు. మరో గాయపడిన బానావత్ స్వామి జూలై 10న మరణించారు. గాయపడిన పద్నాలుగు మంది గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, స్వల్ప గాయాలైన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మృతుల బంధువులకు ఉద్యోగం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జి. సిర్జన హామీ ఇచ్చారు.

Next Story