రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. త్వరలోనే విడుదల

NT Ramarao image on hundred rupees coin . హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్మారకార్థం రూ.100 వెండి

By అంజి  Published on  15 Feb 2023 12:27 PM IST
రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. త్వరలోనే విడుదల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్మారకార్థం రూ.100 వెండి నాణేన్ని కేంద్రం విడుదల చేయనుంది. నాణెంపై ఎన్టీ రామారావు చిత్రం ఉంటుంది. ఇది స్మారక నాణెం కాబట్టి, ఇది మార్కెట్‌లో చెలామణిలో ఉండదు. కాయిన్‌ను భారత ప్రభుత్వం యొక్క మింట్ ద్వారా సేకరించాలనుకునేవారికి విక్రయించబడుతుంది. మే 28న ఎన్టీ రామారావు 100వ జయంతి సందర్భంగా ఈ నాణెం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నాణేం విడుదల అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

నాణేం నమూనాపై సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఎన్టీ రామారావు కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని మింట్ అధికారులు కలిసారు. వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మకు సంబంధించిన నమునాకు పురంధేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మే 28, 2022న, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతాబ్ది ఉత్సవాలను ఆయన కుటుంబం ప్రారంభించింది. ఇది మే 28, 2023 వరకు కొనసాగుతుంది. శతాబ్ది ఉత్సవాలను నెలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 12 కేంద్రాలలో నిర్వహిస్తూ వస్తున్నారు. గతేడాది జరిగిన కార్యక్రమంలో పురంధేశ్వరి మాట్లాడుతూ స్మారకార్థం రూ.100 నాణెం తీసుకురావడానికి ఆర్‌బీఐతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.

ఎన్టీ రామారావు భారతీయ నటుడు, చిత్రనిర్మాత, రాజకీయ నాయకుడు, మూడు పర్యాయాలు ఏడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను ప్రధానంగా తెలుగు సినిమాలో 300 చిత్రాలలో నటించాడు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా పేరుతెచ్చుకున్నారు.

స్మారక నాణెం:

'స్మారక నాణెం' అనేది నిర్దిష్ట సందర్భాలలో లేదా సంఘటనలపై భారత ప్రభుత్వం మింట్ ద్వారా జారీ చేయబడుతుంది. రాజకీయ నాయకుల నుండి సాంస్కృతిక చిహ్నాల వరకు, ప్రసిద్ధ వ్యక్తుల ముఖాలు మొదటి నుండి స్మారక నాణేలలో భాగంగా ఉన్నాయి. కర్నాటక గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి, నోబెల్ గ్రహీత, మిషనరీ మదర్ థెరిసా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇంకా చాలా మంది స్మారక నాణేలను కేంద్రం విడుదల చేసింది.

Next Story