Andhrapradesh: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి
Andhrapradesh: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
అమరావతి: రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ ఇంగ్లీష్ మీడియంలో రాయవచ్చు.
ప్రవేశపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఓసీ,బీసీలకు రూ.150పరీక్ష ఫీజు, ఎస్సీ, ఎస్టీలకు రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ https://cse.ap.gov.in/ లేదా https://apcfss.in/ లో అడ్మిషన్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది. ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు ఓసీ,బీసీ కులాలకు చెందిన వారైతే 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగష్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 2011 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు...
అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి 21
పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం : ఫిబ్రవరి 24
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ : ఫిబ్రవరి 25
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : మార్చి 31
పరీక్ష తేదీ : ఏపిల్ 20
మెరిట్ లిస్ట్ ప్రకటించే తేదీ : ఏప్రిల్ 27
సెలక్షన్ తేదీ : ఏప్రిల్ 27
సర్టిఫికెట్ వెరిఫికేషన్ : ఏప్రిల్ 30
తరగతులు జూన్‌లో ప్రారంభం అవుతాయి.