ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు : వైఎస్ షర్మిల

మోదీకి మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మీరు చాలా గర్వపడుతున్నారు నారా లోకేష్.. కానీ ఏపీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్ని Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  16 Oct 2024 11:54 AM IST
ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు : వైఎస్ షర్మిల

మోదీకి మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మీరు చాలా గర్వపడుతున్నారు నారా లోకేష్.. కానీ ఏపీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్ని Apcc చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. మీ సూపర్ 6 వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఏపీ ముఖ్యమంత్రి ప్రతి వారం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారన్నారు. మోదీ ఏపీకి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టులకు అతి గతి లేదన్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అనే టీవీ షోలో మిమ్మల్ని చూడడం చాలా బాగుంది.. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలకు తమరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంపై మీ ఉద్దేశాలను స్పష్టంగా మాట్లాడాలన్నారు.

Next Story