ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు రూ.40 లక్షల విలువైన నోట్‌బుక్స్, పెన్నులు విరాళం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్‌కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందించింది.

By -  Knakam Karthik
Published on : 30 Sept 2025 12:15 PM IST

Andrapradesh, Minister Nara Lokesh, Notebooks and pens,  government schools

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు రూ.40 లక్షల విలువైన నోట్‌బుక్స్, పెన్నులు విరాళం

అమరావతి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్‌కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందించింది. సుమారు 40 లక్షల విలువైన నోట్ పుస్తకాలు, పెన్నులను కేఎల్ఎస్ఆర్ సంస్థ విరాళంగా అందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. ఈ మేరకు నోట్ పుస్తకాల పంపిణీని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. పుస్తకాల ట్రక్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ తో పాటు కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా టెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ కే.ప్రీతమ్ రెడ్డి, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story