తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్ సైట్ పేరును మరోసారి మార్చింది.

By అంజి  Published on  17 Oct 2023 1:45 PM IST
Tirumala,devotees, TTD, ttdevasthanams

తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్ సైట్ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్ సైట్ పేరు tirupatibalaji.ap.gov.in అని ఉండేది. ఇప్పుడు దాన్ని ttdevasthanams.ap.gov.in అని మార్చింది. తిరుమల శ్రీవారి పుణ్యకేత్రానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.

'వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌సైట్, వన్ మొబైల్ యాప్' కాన్సెప్ట్‌లో భాగంగా టీటీడీ అధికారిక ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in నుండి ttdevasthanams.ap.gov.inకి మార్చబడింది. తిరుమల శ్రీవారికి సంబంధించిన సేవాటికెట్లు, గదులు, మిగిలిన ఎలాంటి సమాచారం అయినా టీటీడీ వెబ్ సైట్ లో భక్తులకు లభిస్తూ ఉండేది. అయితే అధికారిక వెబ్ సైట్ పేరు మార్పును భక్తులు గమనించాలని టిటిడి కోరుతోంది.

ఇప్పటి నుండి ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని టీటీడీ కోరింది. కాగా, గతంలో టీటీడీ వెబ్ సైట్ పేరు టీటీడీసేవాఆన్ లైన్ అనే పేరుతో ఉండేది. అయితే అప్పటికి అది టీటీడీ పేరిట స్వతంత్ర వెబ్ సైట్ గా ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ వెబ్ సైట్ ను ప్రభుత్వానికి అనుబంధం చేస్తూ tirupatibalaji.ap.gov.in గా మార్చారు. ఇప్పుడు ఆ పేరును కూడా మార్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విడుదల చేస్తూ వస్తోంది. తిరుమలకు చేరుకొనేందుకు ఈ వెబ్ సైట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

Next Story