ఏపీలో తప్పని డోలీ మోతలు..5 కిలోమీటర్లు, ఏడు వాగులు దాటి ఆసుపత్రికి (video)

ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం ఏజెన్సీ పరిధిలో గిరిజనుల కష్టాలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి.

By -  Knakam Karthik
Published on : 5 April 2026 9:11 PM IST

AndhraPradesh, Rampachodavaram, AgencyArea, TribalIssues, DoliCarry, HealthCareCrisis

ఏపీలో తప్పని డోలీ మోతలు..5 కిలోమీటర్లు, ఏడు వాగులు దాటి ఆసుపత్రికి (video)

ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం ఏజెన్సీ పరిధిలో గిరిజనుల కష్టాలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి. తడికోట గ్రామంలో చెట్టుపై నుండి పడి తీవ్రంగా గాయపడ్డ చోళ్ల చిన్న రెడ్డి (20) అనే యువకుడి ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామస్థులు అగ్నిపరీక్షే ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రమాదం వల్ల కదలలేని స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో, గిరిజనులు ఒక డోలీని సిద్ధం చేశారు.

ఆ డోలీలో బాధితుడిని ఉంచి ఐదు కిలోమీటర్ల మేర కొండ దారుల్లో మోసుకెళ్లారు. ఈ ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న ఏడు వాగులను గిరిజనులు అతి కష్టం మీద దాటారు. చివరికి 108 సిబ్బందికి సమాచారం అందించగా, వారు రహదారి వద్దకు చేరుకుని బాధితుడిని అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాంకేతిక యుగంలోనూ గిరిజనులకు ఇంకా ఈ డోలీ మోతలు తప్పకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story