ఏపీలో 'స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్' ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి నీతి ఆయోగ్‌ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ను ఏర్పాటు చేయనుందని మంగళవారం అధికారి ఒకరు తెలిపారు.

By అంజి  Published on  2 Aug 2023 2:45 AM GMT
Niti Aayog, State Institute for Transformation, APnews, CM Jagan

ఏపీలో 'స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్' ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ థింక్‌ ట్యాంక్‌ నీతి ఆయోగ్‌ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (సిట్‌)ను ఏర్పాటు చేయనుందని మంగళవారం అధికారి ఒకరు తెలిపారు. అదనపు కార్యదర్శి వి.రాధ నేతృత్వంలోని నీతి ఆయోగ్‌ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో, అధిక వృద్ధి రేటును సాధించడం, వివిధ రంగాలను అభివృద్ధి చేయడానికి వ్యూహాన్ని రూపొందించడం సహా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై అధికారులు చర్చించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. రాబోయే రెండేళ్లలో రాష్ట్రానికి అభివృద్ధి వ్యూహాలను రూపొందించేందుకు నీతి ఆయోగ్ రూ. 5 కోట్లను వెచ్చించనున్నారు.

ఇందులో అధిక వృద్ధి రేటును సాధించేందుకు మేధోపరమైన, ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా జరుగుతుందని రాధా చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన ప్రతినిధి బృందం దక్షిణాది రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి విధానాలపై చర్చించారు. దేశంలో పట్టణీకరణ, పారిశ్రామికీకరణకు ఎంపికైన నాలుగు నగరాల్లో విశాఖపట్నం కూడా ఉండటం స్వాగతించదగ్గ పరిణామమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట సీ పోర్ట్, అదానీ డేటా సెంటర్, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డు తదితర ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా పోర్టు సిటీని ప్రపంచ పటంలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Next Story