బ్రేకింగ్: ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 18 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్

Night Curfew In Andhra Pradesh.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటి నుంచి(24-04-20210) నైట్ కర్ఫ్యూ విధిస్తున్నామని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

By Medi Samrat  Published on  23 April 2021 1:01 PM GMT
Night curfew in AP

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి(24-04-20210) నైట్ కర్ఫ్యూ విధిస్తున్నామని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని.. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా కఠిన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మరింతగా కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సినేషన్ ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖర్చుతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్‌ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. 18-45 వయసు ఉన్న వారికి ఉచితంగా టీకా వేస్తామని.. ఇందుకు గాను 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారని ఆళ్ల నాని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని సూచించారు. కళ్యాణ మండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించారని.. బెడ్స్, కోవిడ్ రిక్రూట్మెంట్ కూడా పెంచుతున్నామన్నారు.


Next Story
Share it