ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ పొడిగింపు
Night curfew extended in andhrapradesh till august 21st.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి కర్ప్యూను పొడిగిస్తూ
By తోట వంశీ కుమార్ Published on 15 Aug 2021 12:37 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి కర్ప్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 21 వరకు కర్ప్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు స్థిరంగా ఉంటున్నాయి. దీనిపై నిన్న ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అనంతరం రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదివారం జీవో జారీ చేసింది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.
కాగా.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(శనివారం) సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 1,535 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,92,191 కి చేరింది. 2,075 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,60,350కి పెరిగింది. కోవిడ్ వల్ల చిత్తూరులో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు, కడపలో ఒక్కరు. విశాఖ పట్నంలో ఒక్కరు చొప్పున 16 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,631కి చేరింది. ఇక రాష్ట్రంలో 18,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 2,55,95,949 సాంపిల్స్ ని పరీక్షించారు.