ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ పొడిగింపు

Night curfew extended in AndhraPradesh.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాత్రి క‌ర్ప్యూను పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2021 11:43 AM IST
ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాత్రి క‌ర్ప్యూను పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్టు 14 వ‌ర‌కు క‌ర్ప్యూని పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. ఈ మేర‌కు అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. కాగా.. క‌రోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా ఉపాధ్యాయులకు టీకా ఇవ్వాలని సీఎం జ‌గ‌న్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా.. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌(గురువారం) సాయంత్రం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం 2,107 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,62,049కి చేరింది. 1,807 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,27,438కి పెరిగింది. కోవిడ్ వల్ల కృష్ణ లో ఆరుగురు, చిత్తూర్ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, అనంతపూర్, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, విశాఖపట్నం మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున 20 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,332కి చేరింది. ఇక రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 2,44,03,410 సాంపిల్స్ ని పరీక్షించారు.

Next Story