కడప: ఉగ్రవాద అనుమానితుడు అబూబకర్ సిద్దిఖీ భార్య సైరా బానును ఎన్ఐఏ అధికారులు కడప జైలు నుండి అదుపులోకి తీసుకున్నారు. జులై 1న రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీని తమిళనాడుకు చెందిన ఐబీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇదే కేసులో అబూబకర్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షమీంను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జైలు వద్దకు ఎన్ఐఏ అధికారులు వచ్చి సైరాబానును కస్టడీకి తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై వారం రోజుల కస్టడీకి తీసుకుని విజయవాడకు తరలించారు.