24 గంటల్లో రెండు గిన్నిస్ రికార్డులు..ఏపీలో చరిత్ర సృష్టించిన NHAI ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచింది

By -  Knakam Karthik
Published on : 7 Jan 2026 12:59 PM IST

Andrapradesh, NHAI project, Bengaluru-Kadapa-Vijayawada Economic Corridor, Guinness Records

24 గంటల్లో రెండు గిన్నిస్ రికార్డులు..ఏపీలో చరిత్ర సృష్టించిన NHAI ప్రాజెక్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచింది. బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్ (NH-544G)పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించాయి.

ఎన్‌హెచ్‌ఏఐ తరఫున ఎం/ఎస్ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో 28.95 లేన్-కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేయడంతో పాటు, 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరంగా వేయడం ద్వారా ఈ అరుదైన ప్రపంచ రికార్డులు నమోదు అయ్యాయి.

ఈ అసాధారణ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు , ఇది భారత ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి హైవే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయని సిఎం చంద్రబాబు అన్నారు. అలాగే ఈ విజయానికి కారణమైన ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ సిబ్బంది అంకితభావం ప్రశంసనీయమని, కఠినమైన NHAI నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ పనులు చేపట్టడం అభినందనీయమని అన్నారు.

Next Story