విజయవాడలోని మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో రోడ్డుపై కొత్త కారు కలకలం రేపింది. తెలిసిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్ (40) అనే ప్రైవేట్ ఉద్యోగి తన ఏపీ16బీఎల్ 1656 నంబర్ గల కారుతో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో స్థానిక మాచవరంలోని దాసాంజనేయ స్వామి దేవాలయానికి పూజలు చేసేందుకు వచ్చాడు. దేవుడికి పూజలు చేసిన తర్వాత చింతల శ్రీనివాస్ కారును బయటకు తీశారు. అయితే డ్రైవర్ బ్రేకులకు బదులు యాక్సిలరేషన్ వేయడంతో పెద్ద శబ్దంతో కారు ముందుకు దూసుకుపోయింది.
శబ్ధానికి భయపడిన భక్తులు, వాహనదారులు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా ఐదు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.