నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా చేశారు. తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేయనున్నట్లు తెలిపారు. తనను పదవి నుంచి దించేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన స్రవంతి, కార్పొరేటర్లపై దాడులకు పాల్పడుతూ, మహిళా కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మేయర్ పదవి ఇచ్చింది మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. తాను పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, ప్రజాసేవలో కొనసాగుతానని వెల్లడించారు.
మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నేతలు గిరిధర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డిల రాజకీయ అంతం చూసే వరకు తమ పోరాటం ఆగదని ఆమె భర్త జయవర్ధన్ అన్నారు. నారాయణ వందల కోట్లు ఎలా సంపాదించాడో త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు.