కాకినాడ జిల్లా తునిలో మైనర్‌బాలికపై అత్యాచారయత్నం ఘటన నిందితుడు నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ పోలీసుల నుంచి తప్పించుకుని చెరువులో దూకేశాడు. పోలీసులు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ కేసులో అరెస్టైన నారాయణరావును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళుతున్నారు. అయితే మార్గమధ్యలో నారాయణరావు బహిర్భూమికి వెళ్లాలని చెప్పి పోలీసుల వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న కోమటి చెరువులో దూకాడు. పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి అతడి కోసం చెరువులో గాలించారు. చివరికి మృతదేహం దొరికింది.