పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టినట్లే, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కడతారని సినీనటుడు నారా రోహిత్ వ్యాఖ్యలు చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని రోహిత్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ డిఫెన్స్‌లో పడిందని, అందుకే తెలుగుదేశం పార్టీపై బురదజల్లుతున్నారని అన్నారు. యువగళం పాదయాత్ర మున్ముందు ప్రభంజనం రేపుతుందన్నారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నారా రోహిత్ సంఘీభావం తెలిపారు. మూడు రోజుల విరామం తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్ సెల్ఫీ ఇస్తున్నారు.