రేపు ఢిల్లీలో మంత్రి లోకేశ్‌ పర్యటన..ఎందుకు అంటే?

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి లోకేష్ సోమవారం ఈమేరకు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు.

By Knakam Karthik
Published on : 17 Aug 2025 3:47 PM IST

Andrapradesh, Minister Nara Lokesh, Delhi Tour, Union Ministers, Pending Projects

రేపు ఢిల్లీలో మంత్రి లోకేశ్‌ పర్యటన..ఎందుకు అంటే?

అమరావతి: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి లోకేష్ సోమవారం ఈమేరకు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులతో భేటీ అయిన లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల రాకతోపాటు వేగవంతంగా అనుమతులు మంజూరవుతున్నాయి.

దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపేందుకు లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రేపటి పర్యటనలో రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెబుతారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డురవాణా, రహదార్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జలరవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి లోకేష్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు అందజేస్తారు.

Next Story