వర్సిటీలను వైసీపీ ఆఫీసులుగా మార్చేశారు.. పెత్తనం మొత్తం వారిదే: లోకేష్‌

Nara Lokesh said that Jagan has turned universities into YCP offices. యూనివర్సిటీలను సీఎం జగన్‌ వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్‌

By అంజి  Published on  10 Aug 2022 10:18 AM GMT
వర్సిటీలను వైసీపీ ఆఫీసులుగా మార్చేశారు.. పెత్తనం మొత్తం వారిదే: లోకేష్‌

యూనివర్సిటీలను సీఎం జగన్‌ వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. రెడ్డి రాజ్యంలో వేధింపులు తట్టుకోలేక పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక బీసీ ఉద్యోగి ప్రకటించడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు అద్దంపడుతోందని ఫైర్‌ అయ్యారు. జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గం అధికారుల ఒత్తిడి తట్టుకోలేక అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ సూపరింటెండెంట్ నాగభూషణం వీఆర్ఎస్ తీసుకుంటానని ప్రకటించడం బాధాకరమని అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని అనంతపురం నుంచి అన్నమయ్య జిల్లా కలికిరికి బదిలీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని లోకేష్‌ డిమాండ్‌ చేశారు. పెత్తనం మొత్తం ఒకే సామాజిక వర్గానికి అప్పజెప్పి బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులను అణగదొక్కాలని చూస్తున్నారని లోకేష్‌ ఆరోపణలు చేశారు. నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు. సీఎం కులపిచ్చ తగ్గించుకుని ఇతర సామాజికవర్గాల వారి ఆత్మ గౌరవం కాపాడాలి హితవు పలికారు.


Next Story
Share it