అరటి రైతులతో లోకేష్‌ భేటీ.. అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని హామీ

Nara Lokesh meets Banana farmers, assures of support after coming to power. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది.

By అంజి  Published on  31 Jan 2023 7:48 AM GMT
అరటి రైతులతో లోకేష్‌ భేటీ.. అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని హామీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం వీకోట మండలం దానమయ్యగారిపల్లె నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. పలమనేరు నియోజకవర్గం కుమ్మరమడుగు సమీపంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో నారా లోకేష్ మాట్లాడారు. అనంతరం అరటి రైతులతో సమావేశమయ్యారు. రైతులు తిప్పయ్య, శివరాజ్‌, నాగరాజు, కుశాల్‌కుమార్‌లతో లోకేష్‌ మాట్లాడారు. పెట్టుబడికి రూ.3 లక్షలకు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వివరించారు. దిగుబడి కేవలం రూ. 1 లక్ష వస్తుండటంతో రూ. 2 లక్షలు నష్టపోతున్నామని చెప్పారు.

పెట్టుబడి ఖర్చు తగ్గించి మంచి రేటు తెస్తే తప్ప అరటి రైతులు కోలుకునే పరిస్థితి లేదని అరటి రైతులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని, అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అరటి రైతుల సమస్యలపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారించి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవాళ సాయంత్రం 4.25 గంటలకు బైరెడ్డిప‌ల్లె ప‌ట్ట‌ణం రాయ‌ల్ మ‌హ‌ల్ లో బీసీ క‌మ్యూనిటీతో నారా లోకేష్‌ స‌మావేశం కానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు బైరెడ్డిప‌ల్లె ప‌ట్ట‌ణంలో తెలుగుదేశం జెండాను ఆవిష్క‌రించనున్నారు. రాత్రి 6.55 గంటలకు క‌మ్మ‌న‌ప‌ల్లె స‌మీపంలోని క‌స్తూరిబా స్కూల్ విడిది కేంద్రంలో బ‌స చేస్తారు. ఈనెల 28 నుంచి కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. దాదాపు 4000 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.

Next Story