రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : నారా లోకేష్

రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

By Medi Samrat
Published on : 11 April 2025 8:36 PM IST

రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : నారా లోకేష్

రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. వచ్చే వారం నుంచి ఇంటి పట్టాను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు నారా లోకేష్. రెండేళ్లలో పట్టాను అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుందని, అయితే దయచేసి ఎవరూ అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ గడువుపై ఏపీ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.

Next Story