ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని ఆ లేఖలో ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. బీసీలకు సంబంధించిన సరైన సమాచారం లేకపోవడంతో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. . బీసీ జన గణన పక్కాగా జరిగి తేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన లేఖలో చంద్రబాబు తెలిపారు. కులాల వారీగా అందుబాటు లో ఉన్న జనగణన వివరాలు 90 ఏళ్ల ఏళ్లనాటివన్నారు. అవి ఇప్పుడు పనికి రావన్నారు. బీసీ జనగణన కోసం టీడీపీ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. దీనిపై ప్రధాని స్పందించాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.