అనంతపురం అమ్మాయికి సాయం చేసిన బాలయ్య

Nandamuri Balakrishna extends help to an intermediate girl student for cancer treatment. ఒకవైపు రాజకీయ నాయకుడిగా.. మరో వైపు సినిమా హీరోగా సక్సెస్ ఫుల్ గా దూసుకుని వెళుతున్నారు

By M.S.R
Published on : 16 Jan 2023 6:22 PM IST

అనంతపురం అమ్మాయికి సాయం చేసిన బాలయ్య

ఒకవైపు రాజకీయ నాయకుడిగా.. మరో వైపు సినిమా హీరోగా సక్సెస్ ఫుల్ గా దూసుకుని వెళుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన పలువురికి సాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటూ ఉన్నారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి మంచి చేసిన బాలకృష్ణ.. మరో అమ్మాయికి అండగా నిలిచారు. అనంతపూర్ కి చెందిన ఒక ఇంటర్ విద్యార్థిని గత కొంత కాలంగా బోన్ కాన్సర్ తో బాధ పడుతుంది. చికిత్స చేయడానికి దాదాపు రూ.10 లక్షల పైనే ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేశారు. బాధితురాలి కుటుంబం ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే. ఈ విషయం నందమూరి బాలకృష్ణ వరకు వెళ్ళింది. దీంతో బాలయ్య వెంటనే స్పందించారు. ఆ కుటుంబంతో ఫోన్ కాల్ ద్వారా పరిస్థితిని తెలుసుకొని, హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ చేయించారు.

ఇక నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకొని కలెక్షన్లలో దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ.104 కోట్ల గ్రాస్ రాబట్టింది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమాకి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది.


Next Story