ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి మరిన్ని బాధ్యతలను అప్పగించారు. వైసీపీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలకు విజయసాయిరెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కాగా.. ప్రస్తుతం విజయసాయిరెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.
'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇంఛార్జ్ గా నన్ను నియమించిన పార్టీ అధినేత, ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు జగన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై నమ్మకంతో నాకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.