బాబు వక్రబుద్ధిని అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు : విజ‌య‌సాయి రెడ్డి

MP Vijayasai reddy slams Chandrababu.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 10:41 AM IST
బాబు వక్రబుద్ధిని అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు : విజ‌య‌సాయి రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వక్రబుద్ధిని ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదన్నారు. వరద ప్రాంతాల పర్యటనలో ఆయ‌న భార్య గురించి మాట్లాడి 'మనిషివా చంద్రబాబు' అనే పరిస్థితి తెచ్చుకున్నాడ‌ని విమ‌ర్శించారు. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు అని విజ‌య‌సాయి రెడ్డి ఎద్దేశా చేశారు. .

'గాల్లో కలిసిపోతారని సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి 'మనిషివా చంద్రబాబు' అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు. ' అని విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. నిన్న చిత్తూరు జిల్లాలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను చంద్ర‌బాబు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ప్ర‌భుత్వానికి ముందుచూపు లేక‌పోవ‌డంతోనే తిరుప‌తితో పాటు ప‌లు ప్రాంతాలు ముంపున‌కు గురైయ్యాయ‌న్నారు. రాయ‌ల‌చెరువు తెగుతుంద‌ని రాష్ట్రం హారెత్తుతుంటే సీఎం గాల్లోనే తిరుగుతున్నాడు. ఈ సీఎం.. గాలి సీఎం. నేను సీఎంగా ఉంటే తిరుప‌తిలోనే బ‌స‌చేసేవాడిన‌న్నారు. చుట్ట‌పుచూపుగా వ‌చ్చే సీఎం మ‌న‌కు అవ‌స‌రమా.? అని ప్ర‌శ్నించారు. 'ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ న‌డ‌వ‌లేడు. తిర‌గ‌లేడు. వృద్దుడు క‌దా..! మొండికేసిన ఎద్దును ముల్లుగ‌ర్ర‌తో పొడిచేందుకే నేను వ‌చ్చా. ముఖ్య‌మంత్రి టెలీకాన్ఫ‌రెన్స్‌లు, వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌కే ప‌రిమిత‌మై యంత్రాంగాన్ని న‌డిపించ‌లేక‌పోతున్నార‌ని' చంద్ర‌బాబు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు.


Next Story