సీఎం జగన్ కి నాలుగో లేఖ రాసిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

MP Raghu rama krishnan raju write Fourth leter to CM Jagan.ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2021 6:30 AM GMT
సీఎం జగన్ కి నాలుగో లేఖ రాసిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ వ‌రుస‌గా నాలుగో రోజు కూడా ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లేఖ రాశారు. ఇప్ప‌టికే ఆయ‌న వృద్ధాప్య పింఛ‌న్లు, సీపీఎస్‌ విధానం రద్దు, పెళ్లి కానుక‌, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల విష‌యంలో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని కోరుతూ జ‌గన్‌కు లేఖలు రాసిన విష‌యం తెలిసిందే. తాజాగా రాసిన లేఖలో ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని ఇచ్చిన‌ హామీని నిల‌బెట్టుకోవాల‌ని కోరారు.ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చింద‌ని గుర్తు చేశారు.

ఈ హామీతోనే ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగుల నుంచి మ‌ద్దుతు ల‌భించింద‌న్నారు. ఉగాదికి నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఆశ‌తో నిరుద్యోగులు ఎదురు చూశార‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా ఉద్యోగాల భ‌ర్తీకి వార్షిక క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాల‌ని లేఖ‌లో ర‌ఘురామ కోరారు. రాష్ట్రంలోని గ్రామ స‌చివాల‌యాల్లో 8,402 పోస్టులు, ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ‌లో 6,100 పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు 18,000, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6,000 భ‌ర్తీకి సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌కుండా వ‌దిలేశార‌ని, వంద‌ల సంఖ్య‌లో సెక్ర‌టేరియ‌ల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌న్నారు. మూడు వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని, కోర్టులో కేసుల కార‌ణంగా అంతంత మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయ‌ని చెప్పారు.

Next Story
Share it