మండితే టీడీపీని వీడడం ఖాయం: కేశినేని నాని
ఎంపీ కేశినేని నాని టీడీపీలో కొనసాగడం కష్టమేనని అంటున్నారు. ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలే అందుకు కారణమని అనిపిస్తూ
By న్యూస్‌మీటర్ తెలుగు
మండితే టీడీపీని వీడడం ఖాయం: కేశినేని నాని
ఎంపీ కేశినేని నాని టీడీపీలో కొనసాగడం కష్టమేనని అంటున్నారు. ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలే అందుకు కారణమని అనిపిస్తూ ఉంది. తాజాగా మరోసారి ఆయన అలాంటి వ్యాఖ్యలే చేసారు. టీడీపీలో పొమ్మనలేక పొగబెట్టినట్టు వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం 40-50శాతం మండిస్తున్నారని, తనకు 100శాతం సెగ తగిలితే ఏమి చేయాలనేది ఆలోచిస్తానని ఎంపీ కేశినేని నాని చెప్పారు. మునిసిపల్ ఎన్నికల సమయంలో తనను కొందరు గొట్టంగాడని వ్యాఖ్యానించారని, తన పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఉన్న గొట్టం గాళ్ల గురించి కూడా తాను పనిచేస్తున్నానని చెప్పారు.కొందరు పొమ్మనలేక పొగపెడుతున్నారని, తనకు పూర్తిగా మండితే ఏమి చేయాలనేది తాను అప్పుడు ఆలోచిస్తానని అన్నారు. మంచోడిని కాబట్టే తనను ఇతర పార్టీల వారు ఆహ్వానిస్తున్నారని చెప్పుకొచ్చారు.
విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రజలు ఏమనుకుంటున్నారనేది తనకు ముఖ్యమని, ప్రజలు ఆశీర్వదిస్తే ఇండిపెండెంట్‌గా అయినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేవారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు ఉంటాయని కేశినేని చెప్పారు. పార్టీలో అంతర్గత అరెంజ్‌మెంట్ కోసం ఇంచార్జిలను పెట్టుకుంటారని అవేమి రాజ్యాంగ పదవులు కాదన్నారు. విజయవాడ ప్రజలు తనను కావాలని కోరుకుంటున్నారని, ప్రజలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యమని, మధ్యలో ఇంఛార్జిలు అని వచ్చే గొట్టంగాళ్లు ఎవరన్నారు. మహానాడుకు ఆహ్వానం లేదని ఎంపి రామ్మోహననాయుడు తప్ప ఎంపిలకు మాట్లాడే అవకాశం లేదన్నందునే వెళ్లలేదన్నారు. ప్రజల మద్దతు తనకు ఉందని, ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు ఢిల్లీ చర్చల సారాంశం ఏమిటో తనకు తెలియదని కేశినేని అన్నారు. బాబు పిఏ ఫోన్ చేసి రమ్మంటే వెళ్లానని చెప్పారు. వైసీపీ సహా అన్ని పార్టీల నాయకులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు.