విజయసాయిరెడ్డికి మాట్లాడే అర్హత లేదు..
MP Kanakamedala Ravindra Kumar Fires On Vijayasai Reddy. భాష, సంస్కృతి-సంస్కారం గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ
By Medi Samrat Published on 14 Nov 2021 1:51 PM GMTభాష, సంస్కృతి-సంస్కారం గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పెద్దలంటే గౌరవం తప్ప ఇతరులను ఇబ్బందులు పెట్టే మనస్తత్వం కాదని.. అవినీతికి పాల్పడే సంస్కృతి తెలుగుదేశానికి లేదని అన్నారు. దొంగ డిగ్రీలు, దొంగ కంపెనీల గురించి విజయసాయికే తెలుసునని.. లోకేశ్ కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక విజయసాయి అవకాకులు, చవాకులు పేలుస్తున్నారని ఫైర్ అయ్యారు. సభ్యత, సంస్కారం గురించి విజయసాయి నేర్చుకోవాలిగానీ.. లోకేశ్ కాదని అన్నారు.
విజయసాయిరెడ్డి.. లోకేశ్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. విజయసాయి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. భాష, సంస్కారం, ఆటవిక భాష అనే మాటలు విజయసాయిరెడ్డి నోటి వెంట వస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. భాష గురించి, నాగరికత గురించి మాట్లాడే నైతిక హక్కు విజయసాయిరెడ్డికి గానీ, వైసీపీ నాయకులకు గానీ లేదని అన్నారు.
దొంగ డిగ్రీలు, కంపెనీలతో డబ్బులు తరలించడం, అవినీతికి పాల్పడటం విజయసాయికే తెలుసునని.. ఈ సంస్కృతి తెలుగుదేశానికిగానీ, చంద్రబాబునాయుడు కుటుంబానికిగానీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల పరామార్శ పర్యటనని, కుప్పంలో ప్రచారానికి లభిస్తున్న స్పందన చూసి ఓర్చుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. నారా లోకేశ్ సభ్యత గురించి సాయిరెడ్డి మాట్లాడుతుంటే.. సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని విమర్శించారు. లోకేశ్ ఏనాడు జగన్ లా బాబాయిని కొట్టలేదని.. బాబాయి అంటే గౌరవం, అభిమానమని.. జగన్ లా మాత్రం కాదని ఎంపీ కనకమేడల విమర్శలు గుప్పించారు.