ఏపీలో విషాదం.. ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి మృతి

తొలి కాన్పులోనే ఓ తల్లి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.

By అంజి  Published on  5 July 2024 12:59 AM GMT
Mother died, birth, Penukonda mandal, APnews

ఏపీలో విషాదం.. ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి మృతి 

తొలి కాన్పులోనే ఓ తల్లి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మోటువారిపల్లిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోటువారిపల్లికి చెందిన గిరిరాజుకు 2020, సెప్టెంబరు 18న కురుబవాండ్లపల్లికి చెందిన వెన్నెల(24)తో పెళ్లి జరిగింది. ఆమె గత నెల 29న అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.

డెలివరీ తర్వాత వెన్నెల అస్వస్థతకు గురైంది. అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం నాడు మృతి చెందింది. ముగ్గురు శిశువుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. గురువారం నాడు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చారు. బాలింత మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. మంత్రి సవిత ఈ విషయం తెలుసుకుని గ్రామానికి వెళ్లి బాలింత మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Next Story