ఏపీలో మరో వారం ఒంటిపూట బడులే.. విద్యాశాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. జూన్ చివరి వారానికి వస్తున్నా ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే వేడిగాలుల
By అంజి Published on 19 Jun 2023 6:49 AM ISTఏపీలో మరో వారం ఒంటిపూట బడులే.. విద్యాశాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. జూన్ చివరి వారానికి వస్తున్నా ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే వేడిగాలుల దృష్ట్యా ఉదయం పాఠశాలలను మరో వారం పాటు పొడిగించింది పాఠశాల విద్యాశాఖ. జూన్ 24 వరకు పాఠశాలలు ఉదయం 7:30 నుండి 11:30 గంటల వరకు పనిచేస్తాయని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదివారం విజయవాడలో ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. రాగి జావా ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు వడ్డిస్తారు. మధ్యాహ్న భోజనం 11:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. మరోవైపు ఉదయం పాఠశాలల పొడిగింపును తల్లిదండ్రులు స్వాగతించారు. దీంతో ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు ఒక్కపూట బడుల్ని నిర్వహించాల్సి ఉంటుంది.
గొంప ప్రభాకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన కవల పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నారని, ఇది చాలా ఉపశమనం కలిగించిందని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు చేసినట్టుగానే నెలాఖరు వరకు సెలవులు పొడిగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గృహిణి సుజాత గరుగుబల్లి మాట్లాడుతూ.. సెలవులు పొడిగించడం వల్ల వేడిగాలుల సమయంలో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండొచ్చన్నారు. చిన్నపిల్లల వైద్య నిపుణుడు జి రాములు మాట్లాడుతూ.. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా చూడాలని సూచించారు. వారు కఠినమైన వాతావరణాన్ని తట్టుకోలేరు. అయితే ప్రభుత్వం తీసుకుంది మంచి నిర్ణయమని ఆయన ఉదయం పాఠశాలలను స్వాగతించారు.